![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -998 లో.. శైలెంద్ర దేవయని ఇద్దరు కలిసి మాట్లాడుతుంటారు. ఎండీ చైర్ మనదే అంటు సంబరపడుతుంటే ధరణి వచ్చి.. అది జరగదని చెప్తుంది. ఎన్నోసార్లు ఇలాంటి కుట్రలు చేశారు. మీ దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళింది. ఈసారి కూడా అలాగే జరుగుతుంది చూడండని ధరణి వాళ్ళతో అంటుంది. అప్పుడంటే చిన్న మొత్తం డబ్బు.. ఇప్పుడు కొన్ని కోట్లు.. ఎవరు ఇస్తారని శైలెంద్ర అంటాడు. ఎవరో ఒకరు ఇస్తారేమో కానీ మీరు అయితే ఎండీ కాలేరు. నేను చెప్పింది జరుగుతుంది చూడండని ధరణి అంటుంది.
ఒకవేళ నువ్వు చెప్పిందే జరిగితే.. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. నీ పనులు అన్ని నేనే చేస్తాను. నీ కాలు కాడ కుక్కలాగా పడి ఉంటానని ధరణికి శైలేంద్ర సవాలు విసురుతాడు. మేమ్ అన్నదే జరిగితే నువ్వు ఏం చేస్తావని ధరణిని దేవయాని అడుగుతుంది. తను ఏం చెయ్యడం వద్దులే మమ్మీ.. తనకే మనం ఒక పనిమనిషిని పెడుదామని శైలెంద్ర అంటాడు. మీరు ఎన్ని చెప్పినా ఈ ఎండీ సీట్ మీకు దక్కదని ధరణి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలా చాలా సార్లు జరిగింది. మన జాగ్రత్తలో మనం ఉండాలని శైలెంద్రతో దేవయాని అంటుంది. ఆ తర్వాత మహేంద్రకి అనుపమ కాఫీ తీసుకొని వస్తుంది. నాకు వసుధార గురించి టెన్షన్ అవుతుంది. అందరు రిషి లేడంటే తను ఉందని అంటుందంటూ మహేంద్ర బాధపడతాడు. ఇష్టమైన వాళ్ళు దూరం అయితే చాలా కష్టంగా ఉంటుందని అనుపమ అంటుంది. అప్పుడే వసుధార వచ్చి.. వాళ్ళ మాటలు వింటుంది. మీరు నా గురించి బాధపడడం ఒకే కానీ రిషి సర్ లేడని మాత్రం అనకండి. ఇప్పుడు రిషి సర్ కి సరైన వైద్యం అందుతుందో లేదు సరైన ఫుడ్ ఉందో లేదో అని మాత్రమే నేను ఆలోచిస్తున్నానని వసుధార అంటుంది.
ఆ తర్వాత రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేసి.. నేనొక ప్లాన్ చేసాను. రేపు ఎండీ సీట్ నాది.. అందులోని మరదలు నీదని శైలెంద్ర చెప్పగానే.. థాంక్స్ అని రాజీవ్ అంటాడు. మొన్న ఒకడు వసుధారని సేవ్ చేసాడని అన్నాను కదా ఒకవేళ వాడు వస్తాడేమో అని రాజీవ్ అంటాడు. ఎవరు రారు నువ్వు అలాంటివేం ఆలోచించకు. రేపు వచ్చి నీ మరదలిని తీసుకొని వెళ్ళని రాజీవ్ తో శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత అనుపమ వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేసి జరుగుతున్న సంఘటనలన్ని చెప్తుంది. వాళ్లని నువ్వెలా ఆ ప్రాబ్లెమ్ నుండి బయటపడెయ్యాలో అని ఆలోచించని వాళ్ళ పెద్దమ్మ చెప్తుంది. మరుసటిరోజు వసుధార రిషి బ్రాస్ లైట్ ని చూస్తూ బాధపడుతుంది. బ్రాస్ లైట్ ని వసుధార తన చెయ్యికి పెట్టుకొని ఎట్టి పరిస్థితిలోను కాలేజీని చెయ్యి జారనివ్వనని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |